ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ నేతృత్వంలోని మెల్‌బోర్న్ స్టార్స్.. పెర్త్ స్కార్చర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
స్టోయినిస్ (37), టామ్ కర్రన్ (37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో జో క్లార్క్ 0, థామస్ రోజర్స్ 14, సామ్ హార్పర్ 1, కార్ట్‌రైట్ 18, వెబ్‌స్టర్ 19, హెచ్ మెక్‌కెంజీ 4, ఆడమ్ మిల్నే 2, బ్రాడీ కౌచ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. స్కార్చర్స్ బౌలర్లలో జై రిచర్డ్‌సన్ 3, లాన్స్ మోరిస్ 2, బెహ్రెన్‌డార్ఫ్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన స్కార్చర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కూపర్ కన్నోలీ (64) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్టార్చర్స్ విజయానికి బీజం వేశాడు. ఆస్టన్ టర్నర్ (37 నాటౌట్), నిక్ హాబ్సన్ (27 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌లతో స్కార్చర్స్‌ను విజయతీరాలకు చేర్చారు.
స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (6), కీటన్ జెన్నింగ్స్ (4), మాథ్యూ హర్స్ట్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మెల్‌బోర్న్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, పీటర్ సిడిల్, టామ్ కర్రన్, బ్రాడీ కౌచ్ తలో వికెట్ పడగొట్టారు. రేపు జరుగబోయే మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment