బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్‌కు ముందు మెల్‌బోర్న్ స్టార్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ని నియమించింది. గ్లెన్ మాక్స్‌వెల్ వారుసుడిగా స్టోయినిష్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మెల్‌బోర్న్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మాక్సీ.. గత సీజన్ అనంతరం సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. గత సీజన్‌లో స్టార్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది.
10 మ్యాచ్‌లు ఆడిన మెల్‌బోర్న్ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలోనే మాక్స్‌వెల్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. కాగా స్టోయినిస్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో మాక్సీ గైర్హాజరీలో మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్‌గా మార్కస్ వ్యవహరించాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం స్టోయినిష్ స్పందించాడు.
"గత సీజన్‌లో 'మ్యాక్సీ' లేకపోవడంతో కొన్ని మ్యాచ్‌ల్లో మెల్‌బోర్న్ సారథిగా వ్యవహరించే అవకాశం దక్కింది. కెప్టెన్సీని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
గత పదేళ్లగా మెల్‌బోర్న్ స్టార్స్ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాను. ఈసారి నాయకుడిగా మా జట్టును విజయఫథంలో నడిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తాను" అని స్టోయినిస్ పేర్కొన్నాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరపున 98 మ్యాచ్‌లు ఆడిన స్టోయినిష్.. 2656 పరుగులు చేశాడు.
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టోయినిస్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. తొలి స్ధానంలో గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్ 14వ సీజన్ డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: SA vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్
Comments
Please login to add a commentAdd a comment