
టాంటాన్: వన్డే వరల్డ్‌కప్‌లో బుధవారం పాకిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న స్టోయినిస్.. పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడైన స్టోయినిస్.. భారత్‌తో మ్యాచ్‌లో ఐదో ఓవర్ వేస్తుండగా పక్కటెముకలు పట్టేశాయి. అది అతన్ని బాధించడంతో తన స్పెల్‌ను కొనసాగించలేకపోయాడు.
కాగా, తిరిగి 48 ఓవర్‌తో పాటు చివరి ఓవర్ వేశాడు. కాగా, ఆ గాయం నుంచి స్టోయినిస్ ఇంకా పూర్తిగా కోలుకోలేకపోవడంతో పాక్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీ నుంచి స్టోయినిస్ వైదొలిగితే ఆ స్థానాన్ని మిచెల్ మార్ష్‌తో భర్తీ చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ సూత్రప్రాయంగా వెల్లడించాడు. వరల్డ్‌కప్‌కు స్టోయినిస్ దూరమైన పక్షంలో మిచెల్ మార్ష్ జట్టులో కలుస్తాడని స్పష్టం చేశాడు.