ఐపీఎల్-2022 సీజన్‌తో లక్నో ఫ్రాంఛైజీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్పీ సంజీవ్ గోయెంక గ్రూపు నేతృత్వంలోని ఈ ఫ్రాంఛైజీ తమ జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ అనే పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేఎల్ రాహుల్, రవి బిష్ణోయి, మార్కస్ స్టొయినిస్‌లను ఎంపిక చేసుకున్న ఈ కొత్త టీమ్.. సోమవారం తమ లోగోను ఆవిష్కరించింది. జాతీయ జెండా రంగులద్దిన ‘గరుడ’ పక్షి రెండు రెక్కల మధ్య బ్యాట్ బాల్‌తో ఈ లోగోను తీర్చిదిద్దారు.
అదే విధంగా ఈ లోగోను ఎంపిక చేయడం వెనుక కారణాన్ని కూడా లక్నో ఫ్రాంఛైజీ వెల్లడించింది. ‘‘గరుడ- రక్షించగల శక్తి ఉన్నది.. వేగంగా కదిలే గుణం కలది.. గరుడ సర్వాంతర్యామి. భారత దేశంలోని ప్రతి సంస్కృతి, ఉప సంస్కతుల్లోనూ ఇది భాగం. ఇక త్రివర్ణాలతో కూడిన రెక్కలు.. లక్నో సూపర్ జెయింట్స్ పాన్ ఇండియా అప్పీల్‌కు ప్రతీక. పక్షి శరీరం, నీలం రంగుతో కూడిన బ్యాట్... క్రికెట్‌కు ప్రతీక. ఎరుపు రంగు బంతి, ఆరెంజ్ సీమ్.. జై తిలక్‌ను ప్రతిబింబిస్తుంది.
పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు సాగే లక్నో సూపర్ జెయింట్స్ ప్రతి భారతీయుడికి చెందినది.. జాతిని ఏకం చేస్తుంది’’ అని పేర్కొంది. కాగా లక్నో ఫ్రాంఛైజీ... టీమిండియా వైస్ కెప్టెన్ రాహుల్‌కు 17 కోట్లు, ఆసీస్ ఆటగాడు స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.
చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్
Comments
Please login to add a commentAdd a comment