ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్, కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 7) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ ఆసక్తికర సమరం రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. డీసీ తరఫున డేవిడ్ వార్నర్, అన్రిచ్ నోర్జే, ఎల్‌ఎస్‌జీ నుంచి మార్కస్ స్టోయినిస్ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ మ్యాచ్ మరింత రంజుగా మారనుంది. ప్రస్తుత సీజన్‌లో లక్నో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి జోరుమీదుండగా.. డీసీ ఈ సీజన్‌లో ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించినప్పటికీ గెలుపుపై ధీమాగా ఉంది.
వార్నర్, నోర్జే లాంటి స్టార్ల రాకతో పంత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తుండగా..ఆల్ రౌండర్ స్టోయినిస్ ఎంట్రీతో లక్నో సైతం ఏమాత్రం తగ్గేదేలేదంటుంది. లీగ్‌లో ఇరు జట్లు ఆడిన చివరి మ్యాచ్‌ల విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో లక్నో సన్‌రైజర్స్‌పై అద్భుత విజయాన్నందుకోగా.. ఢిల్లీ గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ఇరు జట్లలో మార్పులు చేర్పుల అంశాన్ని పరిశీలిస్తే.. ఈ మ్యాచ్ కోసం డీసీ జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది.
వార్నర్ రాకతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమ్ సీఫెర్ట్‌పై వేటు పడనుండగా, ఖలీల్ అహ్మద్ స్థానంలో నోర్జే, గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన మన్‌దీప్ సింగ్ స్థానంలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌లకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు లక్నో కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్ ఎంట్రీతో ఆండ్రూ టై బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఈ మార్పు మినహా ఎస్‌ఆర్‌హెచ్‌తో బరిలోకి దిగిన జట్టునే ఎల్‌ఎస్‌జీ యధాతథంగా కొనసాగించనుంది. బలాబలాల విషయానికొస్తే.. స్టార్ల రాకతో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి.
తుది జట్లు (అంచనా):
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), ఎవిన్ లూయిస్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, అంకిత్ రాజ్‌పుత్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, కేఎస్ భరత్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోవమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మాన్
చదవండి: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్.. యార్కర్ల కింగ్ రానున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment