బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ మెల్‌బోర్న్ స్టార్స్ సూపర్ విక్టరీ సాధించారు. స్టోయినిస్ ఊచకోతతో (19 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెల్‌బోర్న్ న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. స్టోయినిస్ విధ్వంసం ధాటికి అడిలైడ్ నిర్ధేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది.
క్రిస్ లిన్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (32 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృస్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మెల్‌బోర్న్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లతో రాణించాడు.
Brilliant fireworks in Adelaide during BBL match on New Year's Eve.pic.twitter.com/2khkPbaSoO
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023
పోటాపోటీగా విరుచుకుపడిన లారెన్స్, వెబ్‌స్టర్, స్టోయినిస్..
206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్.. డేనియల్ లారెన్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (17 బంతుల్లో 28; 5 ఫోర్లు) పోటాపోటీగా రాణించడంతో 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అడిలైడ్ బౌలర్లలో కెమారూన్ బాయ్స్ (4-0-15-1) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment