![Marcus Stoinis announces retirement from ODIs ahead of Champions Trophy 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/Untitled-2_0.jpg.webp?itok=rWGCVJG9)
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు స్టోయినిస్ విడ్కోలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్న మార్కస్ అనుహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు.
గత కొనేళ్లగా వైట్ బాల్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టులో స్టోయినిస్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో కూడా అతడు సభ్యునిగా ఉన్నాడు. అయితే టీ20 క్రికెట్‌పై దృష్టి సారించేందుకు 35 ఏళ్ల ఆల్‌రౌండర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
స్టోయినిస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో ఆడుతున్నాడు. స్టోయినిస్ చివరగా ఆస్ట్రేలియా తరపున చివరి వన్డే మ్యాచ్ పాకిస్తాన్‌పై ఆడాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే తన జట్టుకు ఆల్‌ది బెస్ట్ స్టోయినిస్ చెప్పుకొచ్చాడు.
అందుకే రిటైర్మెంట్..
"ఆస్ట్రేలియాకు అత్యుత్తున్నత స్దాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఆడిన ప్రతీ క్షణానాన్ని నేను అస్వాదించాను. ఈ రోజు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను.
ఇది అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ నా కెరీర్‌లోని తదుపరి అధ్యాయంపై దృష్టి సారించేందుకు సరైన సమయంగా భావిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతడు నాకు ఎంతో మద్దతిచ్చాడు.
నాకు సపోర్ట్‌గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, నా సహచరులు, అభిమానులందరికి ధన్యవాదాలు" అని తన రిటైర్మెంట్ ప్రకటనలో స్టోయినిస్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 71 వన్డేలు ఆడిన మార్కస్ స్టోయినిస్.. 1495 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బౌలింగ్‌లో 48 వికెట్లు తీశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టోయినిస్ తీసుకున్న నిర్ణయం ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా తమ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సేవలు కోల్పోయే సూచనలు కన్పిస్తున్నాయి. చీలమండ గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ ఛాంపియన్స్ ట్రొఫీకి దూరమయ్యే అవకాశముంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. స్టోయినిష్ స్ధానంలో మరో కొత్త ఆటగాడు ఈ జట్టులోకి రానున్నాడు.
చదవండి: CT 2025: 'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు'
Comments
Please login to add a commentAdd a comment