
మెల్‌బోర్న్: భారతీయ క్రికెటర్లపై ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ ప్రశంసలు కురిపించాడు. అసలు భారత క్రికెట్‌లో ఉన్న టాలెంట్ మరేక్కడా లేదంటూ కొనియాడాడు. ఇంకా ఇప్పటికీ చాలా మంది క్రికెటర్లు భారత జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న సంగతిని స్టోయినిస్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. నేటికీ భారత జాతీయ జట్టులో చోటు దక్కని క్రికెటర్లు తనకంటే ఎంతో టాలెంటెడ్ అంటూ పొగడ్తలు కురిపించాడు.
ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ విడుదల చేసిన స్టోయినిస్.. దీనిలో భాగంగా భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తేశాడు. ‘ నాకు భారత్‌లో ఆడటం చాలా ఇష్టం. నేను భారతీయ సంస్కృతిని బాగా ఇష్టపడతా. భారత్‌లో ఎంతో నైపుణ్యం ఉన్న క్రికెటర్లు ఉన్నారు. వరల్డ్‌లోనే భారత్ మోస్ట్ టాలెంటెడ్ జట్టు. ఆ జట్టులో ఉన్న టాలెంట్‌ను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది’ అని స్టోయినిస్ పేర్కొన్నాడు. అదే డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా 2018-19 ఆసీస్ పర్యటనలో భారత్ సాధించిన అద్భుత విజయాలను లాంగర్ గుర్తు చేసుకున్నాడు. ప్రధానంగా భారత్‌తో జరిగిన ఆ టెస్టు సిరీస్‌ను తమకు గెలిచే అవకాశాలు వచ్చినా దాన్ని కోల్పోయామన్నాడు. ఆ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియాల టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, టెస్టు సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment