టీ20 వరల్డ్‌కప్ 2024 జర్నీని ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-బిలో పసికూన ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో (67 నాటౌట్, 3/19) ఇరగదీసి ఆసీస్‌ను గెలిపించాడు. స్టోయినిస్ దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఒమన్ విలవిలలాడిపోయింది.
వివరాల్లోకి వెళితే.. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ (12), మిచెల్ మార్ష్ (14), మ్యాక్స్‌వెల్ (0) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. మెహ్రాన్ ఖాన్ 2, బిలాల్ ఖాన్, కలీముల్లా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు.
జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ టాప్ స్కోరర్‌గా నిలువగా..మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment