ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి.
వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.
కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment