IPL: సెహ్వాగ్‌ రికార్డు బ్రేక్‌ చేసిన స్టొయినిస్‌.. | IPL 2024: Stoinis Creates History Breaks Sehwag Monumental Record | Sakshi
Sakshi News home page

స్టొయినిస్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. సెహ్వాగ్‌ రికార్డు బద్దలు

Published Thu, Apr 25 2024 5:08 PM | Last Updated on Thu, Apr 25 2024 5:08 PM

IPL 2024: Stoinis Creates History Breaks Sehwag Monumental Record - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన 34 ఏళ్ల ఈ ఆసీస్‌ స్టార్‌.. పదేళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై- లక్నో మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సేన విజయం సాధించింది. సొంతమైదానంలోనే చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. లక్నో గెలుపులో స్టొయినిస్‌దే కీలక పాత్ర.

సీఎస్‌కే విధించిన 211 లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(0), కేఎల్‌ రాహుల్‌(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. తానున్నానంటూ స్టొయినిస్‌ బ్యాటెత్తాడు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్టొయినిస్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉండటం విశేషం.

కాగా ఐపీఎల్‌ 17 ఏళ్ల చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై నమోదైన వ్యక్తిగత స్కోరు స్టొయినిస్‌దే. అంతకు ముందు 2014లో వీరేంద్ర సెహ్వాగ్‌ చెన్నై మీద 122 పరుగులు సాధించాడు. నాడు పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ముంబైలోని వాంఖడే వేదికగా క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సెహ్వాగ్‌ ఈ మేరకు పరుగులు రాబట్టాడు.

అయితే, చెపాక్‌ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో స్టొయినిస్‌.. సెహ్వాగ్‌ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును బ్రేక్‌ చేశాడు. అంతేకాదు.. నికోలస్‌ పూరన్‌(34), దీపక్‌ హుడా(6 బంతుల్లో 17 నాటౌట్‌)తో కలిసి లక్నోను విజయతీరాలకు చేర్చి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ రన్‌ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(124*) సాధించిన ఆటగాడిగా స్టొయినిస్‌ చరిత్రకెక్కాడు. 

చదవండి: CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement