మిచెల్‌ మార్ష్‌ అరుదైన రికార్డు.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే! | CWC 2023 AUS Vs PAK: Marsh Is The Second Player To Register A World Cup Hundred On His Birthday After Ross Taylor - Sakshi
Sakshi News home page

ODI WC 2023: మిచెల్‌ మార్ష్‌ అరుదైన రికార్డు.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే!

Published Fri, Oct 20 2023 5:22 PM | Last Updated on Fri, Oct 20 2023 6:41 PM

Marsh is the second player to register a World Cup hundred on his birthday after Ross Taylor - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌లో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్‌ బౌలర్లను మార్ష్‌ ఊచకోత కోశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 108 బంతులు ఎదుర్కొన్న మార్ష్‌ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు.

కాగా మార్ష్‌ తన పుట్టిన రోజునే సెంచరీని సాధించడం విశేషం. ఆక్టోబర్‌ 20న మార్ష్‌ 32 వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇక బర్త్‌డే రోజున సెంచరీతో చెలరేగిన మార్ష్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో బర్త్‌డే రోజున సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మార్ష్‌ రికార్డులకెక్కాడు.

ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో తొలి స్ధానంలో కివీస్‌ దిగ్గజం రాస్‌ టేలర్‌ ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టేలర్‌ తన జన్మదినం నాడు సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఫీట్‌ సాధించిన లిస్ట్‌లో మార్ష్‌ ఆరో స్ధానంలో నిలిచాడు.
చదవండి: WC 2023 PAK vs AUS: పాకిస్తాన్‌పై సూపర్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన డేవిడ్‌ వార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement