T20 WC 2024 IND vs AUS: ఆసీస్‌పై ఘన విజయం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ | T20 World Cup 2024, India Vs Australia Live Score, Updates And Highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2024 IND vs AUS: ఆసీస్‌పై ఘన విజయం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

Published Mon, Jun 24 2024 7:35 PM | Last Updated on Mon, Jun 24 2024 11:50 PM

T20 WC 2024 Super 8: India  vs Australia match live updates and highlights

India  vs Australia match live updates and highlights:

ఆసీస్‌పై ఘన విజయం..
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 సెమీఫైన‌ల్లో భార‌త జ‌ట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూప‌ర్‌-8లో భాగంగా సెయింట్ లూసియా వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన భార‌త్.. గ్రూపు-1 నుంచి  త‌మ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ విజయంతో 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమికి భారత్‌ బదులు తీర్చుకుంది.

వారెవ్వా బుమ్రా..
భారత బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న హెడ్‌.. బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోర్‌: 153/5

ఆసీస్ నాలుగో వికెట్ డౌన్‌..
135 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్టోయినిష్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవ‌ర్లకు ఆసీస్ స్కోర్‌: 148/4. క్రీజులో ట్రావిస్ హెడ్‌(75), డేవిడ్‌(2) ప‌రుగుల‌తో ఉన్నారు.

రెండో వికెట్ డౌన్‌.. మార్ష్ ఔట్‌
128 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన మాక్స్‌వెల్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

13 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోర్‌: 128/2
13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా 2 వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్‌(63), మాక్స్‌వెల్‌(20) ప‌రుగుల‌తో ఉన్నారు. 

రెండో వికెట్ డౌన్‌.. మార్ష్ ఔట్‌
87 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన మిచెల్ మార్ష్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి మాక్స్‌వెల్ వ‌చ్చాడు. 10 ఓవ‌ర్లకు ఆసీస్ స్కోర్‌: 99/2. క్రీజులో ట్రావిస్ హెడ్‌(54), మాక్స్‌వెల్‌(0) ప‌రుగుల‌తో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ఆసీస్‌
6 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్‌(26), మిచెల్ మార్ష్‌(31) ఉన్నారు.

తొలి వికెట్ డౌన్‌..
206 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 6 ప‌రుగులు చేసిన డేవిడ్ వార్న‌ర్‌.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వ‌చ్చాడు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా వికెట్ న‌ష్టానికి 22 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(15), హెడ్(0) ఉన్నారు.

రోహిత్ శ‌ర్మ ఊచ‌కోత‌.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్‌
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. టాస్ ఓడి తొలుత  బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. 

భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(92) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. సూర్య‌కుమార్ యాద‌వ్‌(31), శివ‌మ్ దూబే(28) ప‌రుగుల‌తో రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో స్టార్క్‌, స్టోయినిష్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. హాజిల్ వుడ్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.

18 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్‌: 181/4
18 ఓవ‌ర్లు ముగిసే సరికి భార‌త్ 4 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(12), శివ‌మ్ దూబే(28) ప‌రుగుల‌తో ఉన్నారు.

నాలుగో వికెట్ డౌన్‌.. సూర్య ఔట్‌
టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 31 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే సరికి భార‌త్ నాలుగు వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. క్రీజులో శివ‌మ్ దూబే(19), హార్దిక్ పాండ్యా(2) ప‌రుగుల‌తో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌.. రోహిత్‌ శర్మ ఔట్‌
127 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది. 92 ప‌రుగులు చేసిన రోహిత​ శర్మ.. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. రోహిత్ ఇన్నింగ్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.  క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.

దూకుడుగా ఆడుతున్న భారత్‌.. 
11 ఓవ‌ర్లు ముగిసే సరికి భార‌త్ రెండు వికెట్ల న‌ష్టానికి 127 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌(92), సూర్య(17) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్ డౌన్‌.. పంత్ ఔట్‌
93 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన రిష‌బ్ పంత్‌.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి సూర్య‌కుమార్ యాద‌వ్ వ‌చ్చాడు. 8 ఓవ‌ర్లు ముగిసే సరికి భార‌త్ రెండు వికెట్ల న‌ష్టానికి 93 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌(76), సూర్య ఉన్నారు.

రోహిత్ శ‌ర్మ ఫిప్టీ.. 6 ఓవ‌ర్లు భార‌త్ స్కోర్‌: 60/1
6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా వికెట్ న‌ష్టానికి 60 ప‌రుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కేవ‌లం 19 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌(51), రిష‌బ్ పంత్‌(7) ప‌రుగుల‌తో ఉన్నాడు.

రోహిత్‌ జోరుకు వరుణుడు బ్రేక్‌..
సెయింట్‌ లూసియా వేదికగా జరుగుతున్న ఆసీస్‌-భారత్‌ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. 4.1 ఓవర్ల వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ వర్షం కారణంగా అగిపోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంచి జోష్‌లో ఉన్నాడు. 

ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో 41 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా 4.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసింది.

రోహిత్ ఆన్ ఫైర్.. 3 ఓవ‌ర్ల‌కు బార‌త్ స్కోర్‌: 35/1
విరాట్‌ కోహ్లి ఔటైనప్పటకి రోహిత్‌ శర్మ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మూడో ఓవర్‌ వేసిన మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో రోహిత్‌ 4 సిక్స్‌లు, ఒక బౌండరీతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. 3 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 35/1

టీమిండియాకు బిగ్‌ షాక్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. విరాట్ కోహ్లి డ‌కౌట‌య్యాడు. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔట‌య్యాడు. క్రీజులోకి రిషబ్‌ పంత్‌ వచ్చాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2024లో కీలక పోరుకు రంగం సిద్దమైంది.  ఈ మెగా టోర్నీ సూపర్‌-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌లో భార‌త్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగ‌గా.. ఆసీస్ మాత్రం ఒక మార్పు  చేసింది. ఆస్ట‌న్ ఆగర్ స్ధానంలో పేస‌ర్ మిచెల్ స్టార్క్ వ‌చ్చాడు.

తుది జ‌ట్లు
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement