ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ఓవరాల్‌గా యూనైటడ్ కింగడమ్ టూర్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
కంగారులు యూకే పర్యటనలో భాగంగా తొలుత స్కాట్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 2న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసీస్ ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.
ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పర్యటన సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ సెలక్టర్లు రెస్ట్ ఆస. అయితే వీరు ముగ్గురూ వన్డే జట్టులో భాగమయ్యారు.
ఈ టూర్‌లో ఆసీస్ వన్డే, టీ20 జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. కాగా యువ ఆటగాడు కూపర్ కొన్నోలీకి తొలిసారి ఆసీస్ జట్టులో దక్కింది. అదేవిధంగా యువ సంచలనం ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది.
స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టు
మిచిల్ మార్ష్ (కెప్టెన్),. జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ. టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. కామెరాన్ గ్రీన్. ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు
మిచ్ మార్ష్ (కెప్టెన్). సీన్ అబాట్. అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్. ట్రావిస్ హెడ్. జోష్ ఇంగ్లిస్. మార్నస్ లాబుస్చాగ్నే. గ్లెన్ మాక్స్‌వెల్. మాథ్యూ షార్ట్. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
Comments
Please login to add a commentAdd a comment