![Pat Cummins Has Been Sidelined For SA ODI Series Due To Wrist Injury - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/15/Untitled-10.jpg.webp?itok=Zk8Mi3B2)
సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకుంటాడని సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు కమిన్స్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అతని తాజా పరిస్థితిని సమీక్షించి వన్డే జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కమిన్స్ స్థానంలో టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు భావిస్తున్నాయట. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్‌కు వీలైనంత విశ్రాంతి కల్పించాలన్నది క్రికెట్ ఆస్ట్రేలియా యోచనగా తెలుస్తుంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌తో వన్డే సిరీస్ సమయానికంతా సిద్ధంగా ఉండాలని సీఏ కమిన్స్ సూచించిందని సమాచారం.
కాగా, ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే 3 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాతో పర్యటించనున్న విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్ సందర్భంగా గాయపడిన కమిన్స్ (ఎడమ చేతి మణికట్టు విరిగింది) వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్ సమయానికంతా అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment