గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు పంజా విసిరారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్ 152 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లాయాన్ మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. కమ్మిన్స్, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వికెట్ కీపర్ వెర్రెయిన్నే 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు తెంబా బవుమా 38 పరుగులతో రాణించాడు.
రెండో వికెట్ కీపర్ బ్యాటర్‌గా
70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన వెర్రెయిన్నే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గబ్బాలో హాఫ్ సెంచరీ సాధించిన రెండో ప్రోటీస్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు 1963లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో జాన్ వైట్ 66 పరుగులు చేశాడు.
తొలి బంతికి వార్నర్ డకౌట్
ఇక తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి బంతికే వార్నర్ డకౌట్ కాగా.. అనంతరం కొద్దిసేపటికే ఉస్మాన్ ఖవాజా(11), లబుషేన్(11) వికెట్లను ఆసీస్ కోల్పోయింది. 22 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.
చదవండి: IND vs BAN: 'విరాట్ కోహ్లి తర్వాత అతడే భారత స్టార్ ఆటగాడు'
Comments
Please login to add a commentAdd a comment