
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సమయంలో మార్ష్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20కి మార్ష్ దూరమయ్యాడు.
అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే పల్లెకెలె వేదికగా జాన్ 14న జరగనుంది. మరోవైపు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ , డేవిడ్ వార్నర్
చదవండి: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..!
Comments
Please login to add a commentAdd a comment