(Photo Courtesy: Cricket Australia)
స్వదేశంలో జింబాబ్వేతో రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. మరోవైపు వచ్చే నెలలో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా మార్ష్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మార్ష్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఇక అతడి స్థానంలో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ జట్టులోకి వచ్చాడు. కాగా ఇరు జట్లు మధ్య రెండో వన్డే టౌన్స్ విల్లే వేదికగా ఆగస్టు 31 (బుధవారం)న జరగనుంది. కాగా తొలి వన్డేలో మార్ష్ పర్వాలేదనిపించాడు.
ఈ మ్యాచ్‌లో ఆరు ఓవర్లు వేసిన మార్ష్ 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా తొలి వన్డేలో జింబాబ్వేపై ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చదవండి: IND vs PAK: రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు?
Comments
Please login to add a commentAdd a comment