బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25పై ఆతిథ్య ఆస్ట్రేలియా కన్నేసింది. సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సిడ్నీ టెస్టుకు తమ తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌పై జట్టు ఆసీస్ టీమ్ మెనెజ్‌మెంట్ వేటు వేసింది. అతడి స్ధానంలో బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌తో వెబ్‌స్టర్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు.
వెబ్‌స్టర్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బ్యూ వెబ్‌స్టర్ 5297 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి తుది జట్టులో చోటు ఇచ్చారు.
మరోవైపు నాలుగో టెస్టులో పక్కటెముకల నొప్పితో బాధపడ్డ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి తన ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో ఐదో టెస్టులో కూడా స్టార్క్ ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగితా ఆసీస్ జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఆసీస్ ఉంది. ఆఖరి టెస్టులో ఆసీస్ గెలిస్తే సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
Comments
Please login to add a commentAdd a comment