ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ క్రికెటర్‌? | Big Blow For Rishabh Pants Delhi Capitals, Star Player Heads Home Mid-IPL | Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ క్రికెటర్‌?

Published Sat, Apr 13 2024 11:29 PM | Last Updated on Sun, Apr 14 2024 7:26 AM

Big Blow For Rishabh Pants Delhi Capitals, Star Player Heads Home Mid-IPL - Sakshi

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌, ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మధ్య నుంచి వైదొలిగాడు. మార్ష్‌ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం మార్ష్‌ తన స్వదేశానికి వెళ్లినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ ఈఎస్పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫో తెలిపింది.

ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్‌తో సంప్రదింపుల తర్వాతే అతడు ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఈఎస్పీఎన్‌ పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా మార్ష్‌ తన గాయానికి సర్జరీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గాయం కారణంగానే ఢిల్లీ ఆడిన ఆఖరి రెండు మ్యాచ్‌లకు మార్ష్‌ దూరమయ్యాడు.

అయితే మార్ష్‌ ఈ ఏడాది సీజన్‌లో తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రాజస్తాన్‌ రాయల్స్‌పై చేసిన 23 పరుగులకే అతడి టాప్‌ స్కోర్‌గా ఉంది. బౌలింగ్‌లో కూడా కేవలం ఒకే వికెట్‌ సాధించాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement