
ఐపీఎల్-2022 సీజన్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటిల్స్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఐపీఎల్‌కు మార్ష్ దూరమైతే ఢిల్లీకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మార్ష్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లను ఓ సారి పరిశీలిద్దాం.
బెన్ మెక్‌డెర్మోట్
ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మోట్ అద్భుతమైన టీ20 ఆటగాడు. గత రెండు బిగ్‌బాష్ సీజన్‌ల్లో మెక్‌డెర్మోట్ అద్భుతంగా రాణించాడు. 2020 సీజన్‌లో 402 పరుగులు, 2021 సీజన్‌లో 577 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోను మెక్‌డెర్మోట్ రాణించాడు. 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 93 పరుగులు సాధించాడు. కాగా రూ.50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2022 వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కాగా టీ20ల్లో అతడికి ఉన్న రికార్డుల దృష్ట్యా ఢిల్లీ మెక్‌డెర్మోట్‌ని భర్తీ చేసే అవకాశం ఉంది.
దాసున్ షనక
శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్ దసున్ షనక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మార్ష్ స్థానంలో సరైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో షనక అద్భుతంగా రాణించాడు. 3 మ్యాచ్‌ల్లో 124 పరుగులు సాధించాడు.
మోయిసెస్ హెన్రిక్స్
ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బిగ్ బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. గత ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్ 440 పరుగులు సాధించాడు. హెన్రిక్స్ బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించగలడు. ఐపీఎల్‌లో హెన్రిక్స్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 277 పరుగులు సాధించాడు. మార్ష్‌కు ప్రత్యమ్నాయంగా హెన్రిక్స్‌ను తీసుకునే అవకాశం ఉంది.
చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు
Comments
Please login to add a commentAdd a comment