వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021-23కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (మే 22) అధికారికంగా ప్రకటించింది. హాజిల్‌వుడ్.. ఈ మ్యాచ్‌తోపాటు ఆ తర్వాత జరిగే యాషెస్ సిరీస్‌కు సైతం సిద్ధంగా ఉంటాడని పేర్కొంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్ మైదానాంలో జరుగనుండగా.. 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ జూన్ 16 నుంచి జులై 31 వరకు జరుగనుంది. కాగా, ఈ సీజన్‌లో 3 మ్యాచ్‌ల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన హాజిల్‌వుడ్.. కేవలం 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉండివుంటే ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండేది. ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఆ జట్టు ఆఖరి మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు.
కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు.. ఈ సీజన్‌లో ఇదొక్కటే ఆర్సీబీ నిష్క్రమణకు కారణం కాదు. కోహ్లి, డుప్లెసిస్, అప్పుడప్పుడు సిరాజ్ మినహా ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమైంది. దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లాంటి ఆటగాళ్లు ఆర్సీబీ పరాజయాలకు మూల కారకులని చెప్పవచ్చు. ఏదిఏమైనా ఈ ఏడాది కూడా ఆర్సీబీ కప్ లేకుండానే లీగ్ నుంచి నిష్క్రమించింది.
నిన్న జరిగిన గ్రూప్ స్టేజీ ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కోహ్లి వీరోచిత శతకం వృధా కాగా.. శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్‌కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి.
చదవండి: IPL 2023: ఆర్సీబీ టైటిల్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు..!
Comments
Please login to add a commentAdd a comment