
PC: IPL.com
ఐపీఎల్-2023కు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్‌సన్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న రిచర్డ్‌సన్ .. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఈ మెగాటోర్నీ నుంచి తప్పుకున్నాడు.
ఇక ఈ ఏడాది సీజన్‌కు దూరమైన రిచర్డ్‌సన్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్‌ను ముంబై భర్తీ చేసింది. కనీస ధర రూ.1.5 కోట్లకు మెరెడిత్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా తరపున కేవలం 5 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెరెడిత్.. 8 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మూడు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక అతడికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. మెరిడిత్ 2021లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
గత రెండు సీజన్‌ల పాటు ముంబైకే ప్రాతినిథ్యం వహించిన అతడిని.. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ఆ ప్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు మెరెడిత్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్8న సీఎస్‌కేతో తలపడనుంది.
చదవండి: IPL 2023: సునీల్ నరైన్ మ్యాజిక్ .. దెబ్బకు కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment