ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా ఆస్ట్రేలియా పేసర్ జో రిచర్డసన్ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.
జే రిచర్డ్‌సన్ గత కొన్ని రోజులుగా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. అతడి స్థానంలో నాథన్ ఎల్లీస్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం కల్పించింది. ఒక వేళ ఈ ఏడాది సీజన్‌కు రిచర్డసన్ కూడా దూరమైతే ముంబై బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా తయారవుతోంది.
ఇక ఏడాది సీజన్‌లో ముంబై.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అనుమతులు ఇవ్వడంతో జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ 2023 సీజన్ ఆడబోతున్నాడు.
చదవండి: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment