ధోని- రోహిత్ శర్మ
IPL 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని.. మరో రెండు- మూడు సీజన్లపాటు ఐపీఎల్ ఆడే సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 టోర్నీకి సమయం ఆసన్నమైన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ మార్చి 31న మొదలుకానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పది జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడికి ధోని ఐపీఎల్ కెరీర్ గురించి ప్రశ్న ఎదురైంది.
తనదైన శైలిలో హిట్‌మ్యాన్ జవాబు
సీఎస్‌కే కెప్టెన్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనుకుంటున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు హిట్‌మ్యాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘‘గత మూడు నాలుగేళ్లుగా ఎంఎస్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అనే మాట వింటున్నాను. నాకు తెలిసి తను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. మరికొన్ని సీజన్ల పాటు ఆడే సత్తా ఉంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు.
ఆ లోటు ఎవరూ తీర్చలేరు
ఇక ముంబై స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడం గురించి స్పందిస్తూ.. ‘‘తన సేవలు కోల్పోవడం మాకు భారీ ఎదురుదెబ్బ. ఆ లోటు ఎవరూ తీర్చలేరు. అయితే, యువకులకు అవకాశం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అలాగని వారిపై ఒత్తిడి పెంచే విధంగా వ్యవహరించబోము. అర్హులైన వారికి తప్పకుండా అవకాశాలు ఇస్తాం’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
కాగా ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభించనుంది. ఇదిలా ఉంటే రోహిత్ సారథ్యంలో ముంబై ఐదుసార్లు చాంపియన్‌గా నిలవగా.. ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటికీ వీరిద్దరు అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. గత సీజన్‌లో మాత్రం ముంబై, చెన్నై ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవగా.. చెన్నై తొమ్మిదో స్థానంతో ముగించింది.
చదవండి: Steve Smith: ఐపీఎల్-2023.. నేను చేరబోయే టీమ్ అదే: స్టీవ్ స్మిత్
హద్దు మీరి.. అభ్యంతరకరంగా! నెట్టింట షారుక్, కోహ్లి ఫ్యాన్స్ రచ్చ! ఎందుకురా తన్నుకుంటారు?
Comments
Please login to add a commentAdd a comment