ముంబై: ఐపీఎల్ 14 సెకండ్ హాఫ్ కోసం అన్ని జట్లు సన్నద్దం అవుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మిగతా మ్యాచ్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ ఇదివరకే యూఏఈకి చేరుకోగా, శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ అక్కడ అడుగు పెట్టనుంది. అయితే యూఏఈ వేదికగా జరుగునున్న ఐపీఎల్ రెండో దశ కు దాదాపు అన్ని జట్టలకు కీలకమైన వీదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు జై రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్ ఐపీఎల్ 14 మిగతా సీజన్ కు అందుబాటులో ఉండటం లేదని తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
చదవండి:Mohammed Siraj: సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్‌లో భారీ కటౌట్
దీంతో ఆసీస్ యువ పేసర్ నాథన్ ఎలిస్‌తో పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది కాలంగా నాథన్ ఎలిస్ ఆధ్బతంగా రాణిస్తున్నాడు. ఎలిస్ బంగ్లాదేశ్‌తో తన ఆరంగేట్ర మ్యాచ్‌లోనే హ్యట్రిక్ సాధించాడు. ఇక టీ20 ప్రపంచ కప్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లలో ఎలిస్ కూడా ఉన్నాడు. కాగా, ఐపీఎల్ 2021లో 8 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ కేవలం 3 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సైతం క్లిష్టంగా ఉంటాయి. మిగతా 6 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
చదవండి: Megan Schutt: తండ్రైన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్
Nathan ᴇʟʟ-ɪs a 👑
— Punjab Kings (@PunjabKingsIPL) August 20, 2021
He’s the newest addition to #SaddaSquad for the second phase of #IPL2021! 😍#SaddaPunjab #PunjabKings pic.twitter.com/0hMuOJ19NU
Comments
Please login to add a commentAdd a comment