
సిడ్నీ: ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత స్వదేశానికి చేరిన ఆసీస్ క్రికెట్ జట్టు సభ్యులు మళ్లీ బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)తో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌కు కెప్టెన్‌గా వ్యవవహరిస్తున్న అరోన్ ఫించ్ బ్యాట్ ఝుళిపించాడు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో ఫించ్ శతకంతో మెరుపులు మెరిపించాడు.
తొలుత రెనిగేడ్స్ బ్యాటింగ్‌కు దిగగా ఫించ్ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. రెనిగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఫించ్ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 175 పరుగులు చేసింది. అయితే ఆపై టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ ధాటిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. సిడ్నీసిక్సర్స్ జట్టులో స్టీవ్ స్మిత్ సభ్యుడు.
Comments
Please login to add a commentAdd a comment