
మెల్‌బోర్న్: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. గత ఏడాది అతను రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎక్కడైనా లీగ్‌లు ఆడేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక ‘బిగ్ బాష్’ లీగ్‌లో ఆడేందుకు యువీ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. యువరాజ్ మేనేజ్‌మెంట్ వ్యవహారాలు చూసే కంపెనీ ఈ విషయాన్ని చెప్పినట్లు స్థానిక పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది. ‘యువరాజ్ ఏదైనా జట్టుతో జత కట్టేందుకు ఉన్న అవకాశాలను మేం క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చిస్తున్నాం’ అని అతని మేనేజర్ జేసన్ వార్న్ పేర్కొన్నారు. అయితే యువీ కోసం బీబీఎల్ జట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంతర్గత సమాచారం. గతంలోనూ భారత క్రికెటర్లు కూడా బీబీఎల్‌లో ఆడితే బాగుంటుందని పలు సూచనలు వచ్చినా బీసీసీఐ వాటిని అంగీకరించలేదు. (నాదల్ వస్తున్నాడు )
Comments
Please login to add a commentAdd a comment