బ్రిస్బేన్: సిక్సర్‌గా మారబోతున్న బంతిని బౌండరీ ఇవతలినుంచే గాల్లోకి ఎగిరి ఆపడం, ఆపై అవసరమైతే బంతిని లోపలికి తోసిన తర్వాత లైన్ దాటి వెళ్లి వచ్చి కూడా క్యాచ్ అందుకోవడం లేదా మరో ఫీల్డర్‌కు అందించడం ఇటీవల తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి కొనసాగింపుగానా అన్నట్లు జరిగిన ఘటన వివాదం రేపింది. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా వేడ్ కొట్టిన బంతిని ఫీల్డర్ రెన్‌షా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. (ఇక్కడ చదవండి: క్రికెట్‌లో అదొక వేస్ట్ రూల్.. దాన్ని తీసేయండి!)
ఈ క్రమంలో గీత దాటిన అతను అక్కడినుంచే బంతిని లోపల ఉన్న ఫీల్డర్ బాంటన్ వైపు తోశాడు! ముందుగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ తర్వాత అదే పనిగా ఎన్నో రీప్లేలు చూశాక అవుటిచ్చాడు. బంతిని నెట్టే సమయంలో అతని కాళ్లు గాల్లో ఉన్నాయి కాబట్టి నిబంధనల ప్రకారమే సరైనదేనంటూ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఫీల్డర్ లైన్ దాటి ఇలా చేయడం పెద్ద తప్పంటూ మాజీలు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment