తొలి అఫ్గాన్‌ క్రికెటర్గా.. | Afghan spin star Rashid to play in Australia's BBL | Sakshi
Sakshi News home page

తొలి అఫ్గాన్‌ క్రికెటర్గా..

Published Thu, Sep 14 2017 3:03 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

తొలి అఫ్గాన్‌ క్రికెటర్గా..

తొలి అఫ్గాన్‌ క్రికెటర్గా..

అఫ్గానిస్తాన్‌ యువసంచలనం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ కు మరో అరుదైన అవకాశం దక్కింది.

అడిలైడ్: అఫ్గానిస్తాన్‌ యువసంచలనం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ కు మరో అరుదైన అవకాశం దక్కింది.  ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్)లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్టు తరుపున ఈ యువ స్పిన్నర్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు తమతో రషీద్ ఖాన్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ గురువారం వెల్లడించింది. తద్వారా బిగ్బాష్ లీగ్లో ఆడనున్న తొలి అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌-10లో సన్‌రైజర్స్‌ తరుపున అద్బుత ప్రదర్శన కనబర్చిన 18 ఏళ్ల రషీద్ ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరీబియన్  ప్రీమియర్ లీగ్(సీపీఎల్) లో సైతం రషీద్ ఖాన్ బరిలోకి దిగి అదరగొట్టాడు. అమెజాన్ వారియర్స్ తరుపున ఆడిన రషీద్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో బిగ్ బాష్ లీగ్ లో తీసుకునేందుకు అడిలైడ్ స్ట్రైకర్స్ ముందుకొచ్చింది.

ఈ అవకాశం రావడంపై రషీద్‌  ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘బిగ్‌బాష్‌ లీగ్‌లో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో ఒప్పందం కుదుర్చోకోవడం, ఈ లీగ్‌లో తొలి అఫ్గాన్ గా బరిలోకి దిగడం నాలో అమితోత్సాహాన్ని ఇచ్చింది' అని రషీద్ తెలిపాడు. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ కోచ్‌ గా వ్యవహరిస్తున్న  ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ జాసన్‌ గిలెస్పీ ఈ యువకెరటాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అతని బౌలింగ్‌ లో ప్రత్యేకతే అతన్ని గొప్ప టీ20 క్రీడాకారుడిని చేసిందని కొడియాడారు. 29 అంతర్జాతీయ వన్డేలు ఆడిన రషీద్‌ 63 వికెట్లు తీశాడు. ఇటీవల కరేబియన్‌  టీ20లీగ్‌లో తొలి హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో తనదైన ముద్ర వేసుకున్న రషీద్‌ఖాన్‌ వెస్టిండీస్‌ పర్యటనలో ప్రపంచ నాలుగో అత్యుత్తమ బౌలింగ్‌(7-18) గణంకాలు నమోదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement