క్రిస్ గేల్ కు జరిమానా
హొబర్ట్(ఆస్టేలియా): మహిళా టీవీ ప్రజెంటర్ మెల్ మెక్ లాలిన్ తో అసభ్యంగా మాట్లాడినందుకు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ కు జరిమానా విధించారు. 10 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 4 లక్షల 75 వేల రూపాయలు) జరిమానా వేశారు. ఈ మొత్తం రొమ్ము కేన్సర్ బాధితులకు సహాయం అందిస్తున్న మెక్ గ్రాత్ ఫౌండేషన్ కు వెళుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెబ్ సైట్ వెల్లడించింది.
బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్ సీజీ)లో సోమవారం మహిళా ప్రజెంటర్ తో గేల్ అనుచితంగా ప్రవర్తించాడు. 'నేను ఇక్కడికి వచ్చింది నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికే. నీ కళ్లు అందంగా ఉన్నాయి. సిగ్గుపడకు బేబీ. మ్యాచ్ గెలిచాం. ఇక మనం బయటకు పోదా'మని మెల్ మెక్ లాలిన్ తో గేల్ అసభ్యంగా మాట్లాడాడు. గేల్ వ్యాఖ్యలను బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ తీవ్రంగా పరిగణించింది. దీంతో అతడు క్షమాపణ చెప్పాడు.