మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 128 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. అదే విధంగా వెల్లింగ్టన్, గార్డెనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీ సాటర్త్‌వైట్(44) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.
కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో పెర్రీ(68),తహ్లియా మెక్‌గ్రాత్(57),గార్డెనర్(48) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహుహు మూడు వికెట్లు పడగొట్టగా..అమేలియా కెర్,హన్నా రోవ్, మాకే చెరో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన ఎల్లీస్ పెర్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది.
చదవండి: Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును!
Comments
Please login to add a commentAdd a comment