మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరగున్న తొలి సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ గాయం కారణంగా వెస్టిండీస్‌తో సెమీఫైనల్‌కు దూరమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడిన పెర్రీ ఇంకా కోలులేనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో వెన్ను నొప్పి కారణంగా మూడు ఓవర్లు వేసిన తర్వాత ఆమె మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లింది.
ఈ క్రమంలో కీలకమైన సెమీఫైనల్‌కు పెర్రీ దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ వెల్లడించింది. "దురదృష్టవశాత్తూ పెర్రీ సేవలను సెమీఫైనల్లో కోల్పోతున్నాము. మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.ఆమె ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ప్రస్తుతం పెర్రీ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. పెర్రీ స్థానంలో డెత్ బౌలర్‌ను జట్టులోకి తీసుకువస్తాం" అని లానింగ్ పేర్కింది. ఇక వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 29 న జరగనుంది.
ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): అలిస్సా హీలీ (వికెట్ కీపర్), రాచెల్ హేన్స్, మెగ్ లానింగ్ (కెప్టెన్) బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాస్సెన్ అలనా కింగ్, మేగాన్ స్కాట్, డార్సీ బ్రౌన్
చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!
Comments
Please login to add a commentAdd a comment