
PC: WPL X
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(RCBW) జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025లో ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.
గత మూడు మ్యాచ్‌లలో స్మృతి మంధాన(Smriti Mandhana) సేన చేదు అనుభవాలు చవిచూసింది. ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ.. ఆ తర్వాత యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా తెచ్చుకుని టై చేసుకుంది. అనంతరం గుజరాత్ జెయింట్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టింది.
సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(8) దారుణంగా విఫలం కాగా.. మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్- హాడ్జ్(18 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.
పెర్రీ 47 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మరోవైపు.. రాఘ్వి 32 బంతుల్లో 33 పరుగులు చేయగలిగింది. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(5), కనిక అహుజా(2) చేతులెత్తేయగా.. జార్జియా వారెహాం 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఫలితంగా ఆర్సీబీ 147 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి రెండేసి వికెట్లు కూల్చగా.. మరిజానే కాప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.
డబ్ల్యూపీఎల్-2025: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ వుమెన్ తుదిజట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికీ ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, నల్లపురెడ్డి చరణి.
ఆర్సీబీ వుమెన్
స్మృతి మంధాన (కెప్టెన్), డానియల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వారెహాం, కిమ్ గార్త్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, ఏక్తా బిష్త్.
చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!
Comments
Please login to add a commentAdd a comment