australia - newzeland
-
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్‌గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్‌లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు. ఈ ఘనత సాధించిన కెప్టెన్లు వీరే ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV — ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024 -
ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్!
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గీలాంగ్ వేదికగా శ్రీలంక-నమీబియా జట్లు తలపడనున్నాయి. ఇక తొలుత రౌండ్-1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 23 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. సూపర్-12 మొదటి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు తాడో పేడో తేల్చుకోనున్నాయి. అయితే ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు ఫెర్గూసన్ అందుబాటులో ఉండనున్నట్లు కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. కాగా స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌కు పొత్తికడుపు గాయం కారణంగా ఫెర్గూసన్ దూరమయ్యాడు. అతడి గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ.. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆడించి రిస్క్ తీసుకోడదని న్యూజిలాండ్ జట్టు మేనేజేమెంట్ భావించింది. సిడ్నీ వేదికగా జరిగే మా తొలి మ్యాచ్‌కు ఫెర్గూసన్ మా జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. అతడు తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అదే విధంగా మా ఫైనల్ ప్రాక్టీస్ సెషన్లో అతడు బౌలింగ్ కూడా చేశాడు. అతడు జట్టు మా ప్రధాన బౌలర్. ఫెర్గూసన్ తిరిగి ఫిట్నెస్ సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ -
ఆస్ట్రేలియా విజయాల పరంపర.. న్యూజిలాండ్‌పై భారీ విజయం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 128 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. అదే విధంగా వెల్లింగ్టన్, గార్డెనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీ సాటర్త్‌వైట్(44) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో పెర్రీ(68),తహ్లియా మెక్‌గ్రాత్(57),గార్డెనర్(48) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహుహు మూడు వికెట్లు పడగొట్టగా..అమేలియా కెర్,హన్నా రోవ్, మాకే చెరో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన ఎల్లీస్ పెర్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది. చదవండి: Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
టీ20 సిరీస్ రద్దు.. కారణం అదేనా?
వచ్చే నెలలో జరగాల్సిన న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ రద్దుచేయబడింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్‌లో ఓమిక్రాన్ నిబంధనల కారణంగా ఇరు బోర్డుల అంగీకరంతో సిరీస్ రద్దు చేశారు. కాగా ముందుగా అక్కడి ప్రభుత్వం సరిహద్దుల వద్ద నిబంధనలను సడలించడంతో ఇరు జట్లు మధ్య టీ20 సిరీస్‌ను ప్లాన్ చేశారు. అయితే ఓమిక్రాన్ న్యూజిలాండ్‌లో విజృభించడతో మళ్లీ అక్కడి ప్రభుత్వం రూల్స్‌ను కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్లు మధ్య సిరీస్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. "మేము న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ చేసిన సమయంలో అంతాబాగానే ఉండేది. ట్రాన్స్-టాస్మాన్ దేశాల సరిహద్దు తెరవబడుతుందని మేము ఆశించాము. అయితే దేశంలో ఓమిక్రాన్ విజృభించడతో సరిహద్దుల వద్ద నిభందనలు మరింత కఠినమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సిరీస్ జరగడం అసాధ్యం అని భావించాం. అందుకే మేము ఈ సిరీస్‌ను రద్దు చేశాం" అని న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ పేర్కొన్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం.. మార్చి 17, 18,20 తేదీల్లో నేపియర్ వేదికగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
ఆసీస్‌కు అందిన ద్రాక్ష
-
మ్యాక్సీ సిక్సర్ దెబ్బకు విరిగిన కుర్చీ వేళానికి..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రత్యర్థి బౌలర్లపై శివాలెత్తాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్ నీషమ్ వేసిన 17వ ఓవర్లో మ్యాక్సీ పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్లో వరుసగా 4 6 4 4 4 6 బాది 28 రన్స్‌ను పిండుకున్నాడు. ఈ క్రమంలో మ్యాక్సీ సిక్సర్ల ధాటికి స్టాండ్స్‌లో ఉన్న ఓ సీటు తునాతునకలైంది. సౌథీ వేసిన 18వ ఓవర్లోని నాలుగో బంతి జెట్ వేగంతో స్టాండ్స్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న ఓ సీటును బలంగా తాకింది. బంతి వేగానికి ఆ సీటుకు పెద్ద రంధ్రమే పడింది. స్టాండ్స్‌లో ప్రేక్షకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయ్యింది. మ్యాక్సీ ధాటికి తునాతునకలైన ఆ సీటును ఓ స్వచ్ఛంద సంస్థ కోసం వేలానికి ఉంచనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం మాక్సీ ఆ సీటుపై సంతకం కూడా చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ధాటికి ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 17.1 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటై 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 5 టీ20ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కివీస్ మూడో టీ20ని కోల్పోవడంతో ఆధిక్యాన్ని 2-1కి తగ్గించుకుంది. 💥 70 runs from 31 balls 💥 Eight fours and five sixes An action-packed knock from Glenn Maxwell 🔥#NZvAUS | https://t.co/SauGpoGf1Fpic.twitter.com/yGseEwdnHd — ICC (@ICC) March 3, 2021 -
ప్రపంచకప్‌తో ఆ దేశాలకు కాసుల వర్షం
దుబాయ్: ఇటీవలి వన్డే ప్రపంచకప్ నిర్వహణ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ మెగా టోర్నీ కారణంగా రెండు దేశాల ఆర్థికావృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపించిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ప్రపంచకప్ సందర్భంగా స్థానికంగా 1.1 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల (దాదాపు రూ. 5,385 కోట్లు) లావాదేవీలు జరిగాయని, 8,320 మందికి నేరుగా ఉద్యోగావకాశాలు లభించాయని ఇందులో పేర్కొన్నారు. ఈ టోర్నీ చూసేందుకు లక్షా 45 వేల మంది పర్యాటకులు రావటంతో ఈ రంగంలో ఇరు దేశాల్లో అమిత అభివృద్ధి జరిగిందని ఐసీసీ ప్రకటించింది. ప్రపంచకప్ కారణంగా ఆస్ట్రేలియా జీడీపీ చాలా వేగంగా దూసుకుపోయిందని, పర్యాటకులు దాదాపుగా 855 మిలియన్ యూఎస్ డాలర్లను (దాదాపు రూ. 5 వేల కోట్లు) ఇక్కడ ఖర్చు చేయడం విశేషమని ఐసీసీ సీఈఓ జాన్ హార్న్‌డెన్ చెప్పారు.