ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్‌గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్‌లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు.
ఈ ఘనత సాధించిన కెప్టెన్‌లు వీరే
ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు
రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు
గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు
డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు
కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు
వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు
బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు
షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు
పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు
A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024
Comments
Please login to add a commentAdd a comment