వచ్చే నెలలో జరగాల్సిన న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ రద్దుచేయబడింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్‌లో ఓమిక్రాన్ నిబంధనల కారణంగా ఇరు బోర్డుల అంగీకరంతో సిరీస్ రద్దు చేశారు. కాగా ముందుగా అక్కడి ప్రభుత్వం సరిహద్దుల వద్ద నిబంధనలను సడలించడంతో ఇరు జట్లు మధ్య టీ20 సిరీస్‌ను ప్లాన్ చేశారు. అయితే ఓమిక్రాన్ న్యూజిలాండ్‌లో విజృభించడతో మళ్లీ అక్కడి ప్రభుత్వం రూల్స్‌ను కట్టుదిట్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఇరు జట్లు మధ్య సిరీస్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. "మేము న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ చేసిన సమయంలో అంతాబాగానే ఉండేది. ట్రాన్స్-టాస్మాన్ దేశాల సరిహద్దు తెరవబడుతుందని మేము ఆశించాము. అయితే దేశంలో ఓమిక్రాన్ విజృభించడతో సరిహద్దుల వద్ద నిభందనలు మరింత కఠినమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సిరీస్ జరగడం అసాధ్యం అని భావించాం. అందుకే మేము ఈ సిరీస్‌ను రద్దు చేశాం" అని న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ పేర్కొన్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం.. మార్చి 17, 18,20 తేదీల్లో నేపియర్ వేదికగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment