ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గీలాంగ్ వేదికగా శ్రీలంక-నమీబియా జట్లు తలపడనున్నాయి. ఇక తొలుత రౌండ్-1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 23 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. సూపర్-12 మొదటి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు తాడో పేడో తేల్చుకోనున్నాయి.
అయితే ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు ఫెర్గూసన్ అందుబాటులో ఉండనున్నట్లు కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు.
కాగా స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌కు పొత్తికడుపు గాయం కారణంగా ఫెర్గూసన్ దూరమయ్యాడు. అతడి గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ.. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆడించి రిస్క్ తీసుకోడదని న్యూజిలాండ్ జట్టు మేనేజేమెంట్ భావించింది. సిడ్నీ వేదికగా జరిగే మా తొలి మ్యాచ్‌కు ఫెర్గూసన్ మా జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు.
అతడు తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అదే విధంగా మా ఫైనల్ ప్రాక్టీస్ సెషన్‌లో అతడు బౌలింగ్ కూడా చేశాడు. అతడు జట్టు మా ప్రధాన బౌలర్. ఫెర్గూసన్ తిరిగి ఫిట్‌నెస్ సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు.
చదవండి: వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment