![New Zealands Lockie Ferguson in doubt for Champions Trophy with injury: Report](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/lockie.jpg.webp?itok=UEshQ0fm)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్(Lockie Ferguson) గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఫెర్గూసన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాదదపడుతున్నాడు.
యూఏఈ టీ20 లీగ్-2025లో డెజర్ట్ వైపర్స్‌కు సారథ్యం వహించిన ఫెర్గూసన్‌కు.. దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌లో తొడ కండరాలు పట్టేశాయి. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. ఫెర్గూసన్ మరుసటి రోజు స్కాన్ చేయించుకున్నాడు. అయితే అతడి స్కానింగ్ సంబంధించిన పూర్తి రిపోర్టులు కోసం ఎదురు చూస్తున్నట్లు కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు.
"లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే యూఏఈలో స్కాన్ చేయించుకున్నాడు. అందుకు సంబంధించిన కొన్ని రిపోర్టులు మాకు అందాయి. వాటిని మా రేడియాలజిస్ట్‌కు పంపించాం. లాకీ ఇంకా యూఏఈలోనే ఉన్నాడు. మా రేడియాలజిస్ట్ సూచనమెరకు అతడు పాకిస్తాన్‌కు రప్పించాలా లేదా వేరొకరితో భర్తీ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాము" అని స్టెడ్ పేర్కొన్నాడు.
కాగా బ్లాక్‌క్యాప్స్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్-దక్షిణాఫ్రికాలతో ట్రైసిరీస్‌లో తలపడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాకల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. లహోర్ వేదికగా మొదటి మ్యాచ్‌లో పాక్-న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ఫెర్గూసన్ దూరమయ్యాడు.
కాగా ట్రైసిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలకు ఫెర్గూసన్ బ్యాకప్‌గా జాకబ్ డఫీని న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. ఏదేమైనప్పటికి ఛాంపియన్స్ ట్రోఫీకి లాకీ దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇక మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న ఆతిథ్య పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
స్టాండ్ బై: జేకబ్ డఫీ
చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్‌పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment