మహిళల ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతనిథ్యం వహించే పెర్రీ.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో, బంతితో ఇరగదీసింది.
డబ్యూబీబీఎల్ 2024 సీజన్‌లో పెర్రీ ఇప్పటివరకు చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 39 బంతుల్లో 81 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన పెర్రీ.. రెండో మ్యాచ్‌లో 28 బంతుల్లో 54 పరుగులు చేసి రెండు వికెట్లు తీసింది. మూడో మ్యాచ్‌లో 25 బంతుల్లో అజేయమైన 31 పరుగులు చేసిన పెర్రీ.. ఓ వికెట్ పడగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో 62 బంతుల్లో 86 పరుగులు చేసిన పెర్రీ.. తాజాగా జరిగిన ఐదో మ్యాచ్‌లో 44 బంతుల్లో అజేయమైన 48 పరుగులు చేసి ఓ వికెట్ తీసింది.
ఓవరాల్‌గా పెర్రీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 100 సగటున, 152.28 స్ట్రయిక్‌రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 300 పరుగులు చేసింది. అలాగే ఆరు వికెట్లు తీసింది. మహిళల ఐపీఎల్ ప్రారంభానికి ముందు పెర్రీ సూపర్ ఫామ్ ఆర్సీబీకి శుభ శకునమని చెప్పాలి. పెర్రీ గత ఐపీఎల్ సీజన్‌లోనూ బ్యాట్‌తో పాటు బంతితోనూ ఇరగదీసింది. పెర్రీ 2024 సీజన్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 347 పరుగులు) నిలిచి బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీసింది.
కాగా, మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో జరుగనుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. లీగ్‌లోని ఐదు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలను వెల్లడించాయి. అలాగే తాము రిలీజ్ చేసిన పేర్లను కూడా ప్రకటించాయి.
డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీళ్లే..
స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)
ఆర్సీబీ వదిలేసిన ప్లేయర్లు..
దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్
Comments
Please login to add a commentAdd a comment