డబ్ల్యూపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్, ఆసీస్ స్టార్ ఎలీస్ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ ముప్పుతిప్పలు పెట్టింది.
తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. పెర్రీ సాధించిన 6 వికెట్లు కూడా బౌల్డ్‌లు, ఎల్బీ రూపంలో వచ్చినివే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన పెర్రీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్ మరిజన్నె కాప్(5-15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కాప్ రికార్డును పెర్రీ బ్రేక్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పెర్రీ చెలరేగడంతో ముంబై కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ముంబై బ్యాటర్లలో సజన(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. పెర్రీతో పాటు శ్రేయంకా పాటిల్, శోభన, డివైన్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2024: బాల్ బాయ్‌కు సారీ చెప్పిన రింకూ సింగ్.. అసలేం జరిగిందంటే..?
Comments
Please login to add a commentAdd a comment