భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది! | Ellyse Perry Destroys Car Window At Chinnaswamy With A Monstrous Six | Sakshi
Sakshi News home page

WPL 2024: భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది! వీడియో

Published Tue, Mar 5 2024 9:23 AM | Last Updated on Tue, Mar 5 2024 9:46 AM

Ellyse Perry Destroys Car Window At Chinnaswamy With A Monstrous Six - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది.  బెంగళూరు వేదికగా యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు.

ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన(50 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎల్లీస్ పెర్రీ(37 బంతుల్లో 58) యూపీ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్‌ హిస్టరీలోనే ఆర్సీబీకి ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం.

కారు అద్దం పగలగొట్టిన పెర్రీ..
కాగా ఆర్సీబీ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ ఎల్లీస్‌ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్‌ దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌  19వ ఓవర్ చివరి బంతిని పెర్రీ లాంగ్-ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచింది. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి డిస్‌ప్లే బాక్స్‌లో ఉన్న కారు అద్దానికి తగిలింది. దీంతో అద్దం పూర్తిగా పగిలిపోయింది.

ఇది చూసిన అందరూ ఒక్క షాక్‌కు గురయ్యారు. పెర్రీ సైతం తలపై చేతులు వేసుకుని అయ్యో అన్నట్లు రియాక్షన్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్ పూర్తయిన తరువాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా ఈ కారును అందిస్తారు.
చదవండి: PSL 2024: ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement