ఫైనల్లో ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్‌! వీడియో వైరల్‌ | Emotional Meg Lanning Reflects On Loss Vs RCB In WPL 2024 Final | Sakshi
Sakshi News home page

WPL 2024: ఫైనల్లో ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్‌! వీడియో వైరల్‌

Published Mon, Mar 18 2024 11:04 AM | Last Updated on Mon, Mar 18 2024 11:29 AM

Emotional Meg Lanning Reflects On Loss Vs RCB In WPL Final - Sakshi

డబ్ల్యూపీఎల్‌ ట్రోఫీని తొలిసారి ముద్దాడాలని కలలలు గన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది.

దీంతో వరుసగా రెండో సారి టైటిల్‌కు అడుగు దూరంలో ఢిల్లీ నిలిచిపోయింది. గ‌తేడాది కూడా ఢిల్లీ తుది పోరులోనే ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి  టైటిల్ చేజార‌డంతో ఢిల్లీ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌  క‌న్నీటిప‌ర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీరును ఆమె ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చాలా మంది లానింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఫైనల్లో ఓడినప్పటికీ లీగ్‌ మొత్తం బాగా ఆడారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ సైతం ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది. ఎప్పుడూ నీవు మా రానివే అంటూ లానింగ్‌ ఫోటోను ఢిల్లీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement