ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్‌ | Smriti Mandhana Posing With Rumoured Boyfriend Palash Muchhal After RCB Win WPL 2024 | Sakshi
Sakshi News home page

WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్‌

Published Mon, Mar 18 2024 9:19 AM | Last Updated on Mon, Mar 18 2024 11:29 AM

Smriti Mandhana Posing With Rumoured Boyfriend Palash Muchhal After RCB Win WPL 2024 - Sakshi

డబ్ల్యూపీఎల్‌-2024 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్‌లో గత 16 ఏళ్లగా ఆర్సీబీ పురుషుల జట్టు నిరాశపరుస్తుండగా.. మహిళల జట్టు మాత్రం కేవలం రెండో సీజన్‍‍లోనే టైటిల్ సాధించి సత్తాచాటింది.

ఇక 16 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి డబ్ల్యూపీఎల్ రూపంలో తొలి టైటిల్ రావడంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్లు ఆర్సీబీ మహిళల జట్టును అభినందించారు.

బాయ్‌ ఫ్రెండ్‌తో స్మృతి..
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన బాయ్‌ ఫ్రెండ్‌ స్మృతి పలాష్‌ ముచ్చల్‌ సందడి చేశాడు. మ్యాచ్‌ జరుగుతుండగా ఆర్సీబీకి సపోర్ట్‌ చేస్తూ పలాష్‌ కన్పించాడు. అదే విధంగా విజయనంతరం స్మృతి పలాష్‌ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫోటలోకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలిచినప్పుడు కూడా పలాష్ స్మృతితో పోజులిచ్చింది. ఇక గత కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. బాలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గాపేరు గాంచిన పలాస్‌కు.. ఓ ఈవెంట్‌లో మంధానతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement