ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా పెర్రీ రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో తలపడేందుకు మైదానంలో అడుగుపెట్టిన పెర్రీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకుంది.
ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ పెర్రీ 40 మ్యాచ్‌లు ఆడింది. కాగా అంతకుముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(39) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పెర్రీ రికార్డును బ్రేక్ చేసింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో 1500 పరుగులతో పాటు 100 వికెట్లు సాధించిన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా పెర్రీ నిలిచింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ గ్రూప-ఎ నుంచి తమ సెమీఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మెగా టోర్నీలో ఆసీస్‌కు ఇది వరసుగా నాలుగో విజయం కావడం గమనార్హం.
చదవండి: IND vs AUS: అప్పుడు రాహుల్.. ఇప్పుడు శ్రేయాస్? అయ్యో ఖవాజా ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment