బ్రిస్బేన్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 371 పరుగులు చేసింది.
ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్(87 బంతుల్లో 12 ఫోర్లుతో 101), ఎల్లీస్ పెర్రీ(75 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరితో పాటు లిచ్‌ఫీల్డ్(60),బీత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో సైమా ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, మిన్ను మని 2, దీప్తీ శర్మ, ప్రియా మిశ్రా తలా వికెట్ సాధించారు. కాగా వన్డేల్లో భారత మహిళల జట్టుపై అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఛేజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.
తుది జట్లు
భారత్: ప్రియా పునియా, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్, రేణుకా ఠాకూర్ సింగ్
ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ (వికెట్ కీపర్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్ (కెప్టెన్), సోఫీ మోలినక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షట్
చదవండి: సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్
Comments
Please login to add a commentAdd a comment