మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను | Nizamabad: Newly Married Couple Commits Suicide Writes letter | Sakshi
Sakshi News home page

మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను

Published Thu, Dec 17 2020 1:40 PM | Last Updated on Thu, Dec 17 2020 5:29 PM

Nizamabad: Newly Married Couple Commits Suicide Writes letter - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు నెల రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త సాయి ప్రణీత్ మృతి చెందగా..భార్య విజయ పరిస్థితి విషమంగా ఉంది. కోటగిరి  మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్(22), విజయ(18) కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. అమ్మాయి తల్లి సావిత్రి నెల రోజుల క్రితం ఇద్దరికీ ఓ గుడిలో పెళ్లి చేసింది. కొన్ని రోజుల పాటు అమ్మాయి తల్లి ఇంట్లో ఉన్న జంటకు వేధింపులు ఎక్కువయ్యాయి. అమ్మాయి తల్లి కూతురిని అల్లుడిని వేధిస్తుండటంతో అబ్బాయి తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం

అత్త అక్కడికి సైతం వచ్చి గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ పురుగుల మందు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న జంటను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అబ్బాయ సాయి ప్రణీత్ మృతి చెందాడు. విజయ పరిస్థితి విషమంగా ఉంది.. తన ఆత్మహత్యకు అత్త వేధింపులు కారణం అని సూసైడ్ నోట్ ఇంట్లో లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మచెందర్ రెడ్డి తెలిపారు. చదవండి: పహాడీషరీఫ్‌లో ఆటో డ్రైవర్‌ ఘాతుకం

ఇదిలా ఉండగా తమ చావుకు అమ్మనే కారణమని విజయ సూసైడ్‌ లెటర్‌లో పేర్కొంది. అమ్మ పెట్టే బాధలు భరించలేకే చావడానికి సిద్ధపడుతున్నట్లు వెల్లడించింది. ‘పెళ్లి అయినప్పటి నుంచి అమ్మ వేధింపులకు గురి చేస్తోంది. నాతోపాటు నా భర్తను కూడా ఇబ్బందులు పెడుతోంది. మా అత్తమామలపై కూడా కేసు పెడతామని బెదిరిస్తున్నారు. నన్ను కొడుతున్నారు. మా చావుకు కారణమైన అమ్మను జీవితంలో క్షమించను. ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాను. ఇంకో జన్మంటూ ఉంటే నీ కూతురిగా పుట్టొద్దని దేవుడిని కోరుకుంటున్నా’ అని విజయ లేఖ రాసింది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement