Newly Married Suicide
-
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇష్టం లేని పెళ్లి చేశారంటూ యువతి..
ఇష్టం లేని పెళ్లి చేశారని యువతి పురుగుల మందు తాగగా, భార్య విడాకులు ఇచ్చిందని భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నాయి. వరంగల్ (చిల్పూరు): జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని కొత్తపల్లెకు చెందిన దామెర రేఖ (22) తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ మంగళవారం తెల్లవారుజామున క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తపల్లెకు చెందిన దామెర లచ్చమ్మ కుమారుడు రాజ్‌కుమార్‌కు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన గొడిశాల కుమారస్వామి–స్వరూపల కుమార్తె రేఖతో గత మార్చి 30వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటినుంచి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని రేఖ భర్తతో ఎడమొహం పెడమొహంగా ఉండేది. కొద్దిరోజులు పుట్టింటికి పంపితే మారుతుందని పంపించారు. సోమవారం రేఖను తిరిగి చిల్పూరుకు తీసుకువచ్చారు. మంగళవారం తెల్ల వారు జామున క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య విడాకులు ఇచ్చిందని భర్త.. గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల పంచాయతీ పరిధి గండి గ్రామానికి చెందిన అత్తులూరి భాస్కర్ (36)భార్య విడాకులు ఇచ్చిందని జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల కథనం ప్రకారం.. అత్తులూరి భాస్కర్ గార్లలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం అమలేశ్వరితో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు వీ రి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆరేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. గత జనవరిలో భార్య విడాకులు ఇచ్చింది. భార్య లేదనే మనస్తాపంతో భాస్కర్ మ ద్యానికి బానిసయ్యాడు. జీవి తంపై విరక్తి చెందిన భాస్కర్ ఈ నెల 5న ఇంట్లో తల్లితండ్రులకు గార్ల వెళ్లొస్తానని చె ప్పి, ఇంటికి 100 మీటర్ల దూ రంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా భాస్కర్ బావిలో శవమై కనిపించగా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మృతుడి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై బానోత్ వెంకన్న తెలిపారు. -
మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు నెల రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త సాయి ప్రణీత్ మృతి చెందగా..భార్య విజయ పరిస్థితి విషమంగా ఉంది. కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్(22), విజయ(18) కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. అమ్మాయి తల్లి సావిత్రి నెల రోజుల క్రితం ఇద్దరికీ ఓ గుడిలో పెళ్లి చేసింది. కొన్ని రోజుల పాటు అమ్మాయి తల్లి ఇంట్లో ఉన్న జంటకు వేధింపులు ఎక్కువయ్యాయి. అమ్మాయి తల్లి కూతురిని అల్లుడిని వేధిస్తుండటంతో అబ్బాయి తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం అత్త అక్కడికి సైతం వచ్చి గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ పురుగుల మందు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న జంటను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అబ్బాయ సాయి ప్రణీత్ మృతి చెందాడు. విజయ పరిస్థితి విషమంగా ఉంది.. తన ఆత్మహత్యకు అత్త వేధింపులు కారణం అని సూసైడ్ నోట్ ఇంట్లో లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మచెందర్ రెడ్డి తెలిపారు. చదవండి: పహాడీషరీఫ్‌లో ఆటో డ్రైవర్ ఘాతుకం ఇదిలా ఉండగా తమ చావుకు అమ్మనే కారణమని విజయ సూసైడ్ లెటర్లో పేర్కొంది. అమ్మ పెట్టే బాధలు భరించలేకే చావడానికి సిద్ధపడుతున్నట్లు వెల్లడించింది. ‘పెళ్లి అయినప్పటి నుంచి అమ్మ వేధింపులకు గురి చేస్తోంది. నాతోపాటు నా భర్తను కూడా ఇబ్బందులు పెడుతోంది. మా అత్తమామలపై కూడా కేసు పెడతామని బెదిరిస్తున్నారు. నన్ను కొడుతున్నారు. మా చావుకు కారణమైన అమ్మను జీవితంలో క్షమించను. ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాను. ఇంకో జన్మంటూ ఉంటే నీ కూతురిగా పుట్టొద్దని దేవుడిని కోరుకుంటున్నా’ అని విజయ లేఖ రాసింది. -
పెళ్లయిన నెలరోజులకే నవవధువు ఆత్మహత్య
-
నవవధువు ఆత్మహత్య
పశ్చిమగోదావరి , ఉంగుటూరు: ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన చేబ్రోలులో మంగళవారం జరిగింది. స్థానిక వీఆర్వో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చేబ్రోలుకు చెందిన కారు డ్రైవర్ రామిశెట్టి ధనసాగర్‌కు, తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడికి చెందిన దేవి(19)కి ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. వీరు చేబ్రోలు రైల్వే గేటు వద్ద ఉంటున్న ధనసాగర్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మేనమామ ఇంటికి తాళ్లపూడి వెళ్తానని దేవి ధన సాగర్‌ను అడిగింది. దీనికి అతను నిరాకరించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దేవి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించి కనిపించింది. పెళ్లయిన మూడునెలలకే దేవి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు విజయ, బోసుబాబు విలపించారు. ఉంగుటూరు తహసీల్దార్ వైకేవీ అప్పారావు , గణపవరం సీఐ జి.శ్రీనివాస యాదవ్, చేబ్రోలు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఏ ఫిర్యాదూ ఇవ్వలేదు. కేసు లేకుండా ఇరువర్గాలకూ ప్రజాప్రతినిధులు రాజీ చేసినట్టు సమాచారం. -
ఆత్మహత్య వీడియో హల్చల్
నెల్లిమర్ల: పట్టణానికి చెందిన నవవధువు మృతికి సంబంధించిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. స్థానిక అలబానవీధికి చెందిన కారుకొండ రామారావు భార్య రాజేశ్వరి(20) ఈ నెల 26న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె అగ్నికి ఆహుతి అవుతున్న వీడియో, ఫొటోలు ప్రస్తుతం పట్టణంలోని చాలామంది ఫోన్లలో హల్చల్ చేస్తున్నాయి. బాత్రూమ్లో ఆమె కాలిపోతుండగా ఎవరో వీడియో, ఫొటోలు తీసినట్లు సమాచారం. వాటిని తన స్నేహితులకి పంపించగా పట్టణమంతా వ్యాపించాయి. కాలిపోతున్న రాజేశ్వరి కనీసం కదులుతున్నట్లుగా కూడా వీడియోలో కనిపించడం లేదు. అలాగే ఆమె ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా కూడా లేదు. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందే ఎవరైనా చంపి కాల్చివేశారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజేశ్వరిని ముందే హత్య చేసి బాత్రూమ్లో పడేసి కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా కిరోసిన్ డబ్బా, అగ్గిపెట్టెను బాత్రూమ్ తలుపువద్ద పడేసినట్లు చర్చించుకుంటున్నారు. ఒకవేళ రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లైతే బాత్రూమ్ తలుపు లోపలనుంచి వేసుకుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే మంటలకు కనీసం ఆర్తనాదాలైనా చేసేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వీడియో, ఫోటోలను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.