నవవధువు ఆత్మహత్య | new bride commit to suicide | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్య

Published Wed, Nov 1 2017 10:41 AM | Last Updated on Wed, Nov 1 2017 10:41 AM

new bride commit to suicide

మృతి చెందిన రామిశెట్టి దేవి

పశ్చిమగోదావరి  , ఉంగుటూరు: ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన చేబ్రోలులో మంగళవారం జరిగింది. స్థానిక వీఆర్వో  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చేబ్రోలుకు చెందిన కారు డ్రైవర్‌  రామిశెట్టి ధనసాగర్‌కు, తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడికి చెందిన దేవి(19)కి ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. వీరు చేబ్రోలు రైల్వే గేటు వద్ద ఉంటున్న ధనసాగర్‌ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మేనమామ ఇంటికి తాళ్లపూడి వెళ్తానని దేవి ధన సాగర్‌ను అడిగింది. దీనికి అతను నిరాకరించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దేవి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించి కనిపించింది.

పెళ్లయిన మూడునెలలకే దేవి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు విజయ, బోసుబాబు విలపించారు.  ఉంగుటూరు తహసీల్దార్‌ వైకేవీ అప్పారావు , గణపవరం సీఐ జి.శ్రీనివాస యాదవ్, చేబ్రోలు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.  కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఏ ఫిర్యాదూ ఇవ్వలేదు. కేసు లేకుండా ఇరువర్గాలకూ ప్రజాప్రతినిధులు రాజీ చేసినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement