Karnataka Crime News Telugu: Banaswadi Police Arrested Man Who Harassing Wife - Sakshi
Sakshi News home page

సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ..

Published Wed, Jul 20 2022 3:36 PM | Last Updated on Wed, Jul 20 2022 7:32 PM

Karnataka: Banaswadi Police Arrested Man Who Harassing Wife - Sakshi

సాక్షి, బెంగళూరు: భార్యకు మొబైల్‌లో అశ్లీల చిత్రాలు చూపి హింసిస్తూ, పదే పదే గర్భస్రావం  చేయిస్తున్న భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. బాణసవాడి ప్రాంతంలో ప్రదీప్‌ అనే వ్యక్తి అయిదు నెలల కిందట బాధిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లైన కొన్నిరోజులకే భార్యకు తన నిజ స్వరూపం చూపించాడు. నిత్యం మద్యం తాగి వచ్చి ఆమెపై చిత్రహింసలకు పాల్పడేవాడు. అశ్లీల వీడియోలు చూపించి వేధింపులకు గురిచేశాడు.

సెగరెట్‌తో వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. భర్త బాధలు పడలేక మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ భర్త ప్రదీప్‌ ఆమె సతాయించడం మానలేదు. ఒకటి రెండుసార్లు గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్‌ చేయించాడు. స్నేహితులను ఇంటికి పిలిపించి పార్టీ చేసుకుని వారి ముందే భార్యను హింసించేవాడు. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టి, విడాకులు ఇవ్వాలని డిమాండ్‌ చేసేవాడు. సైకో భర్త ప్రవర్తనతో విసుగుచెందిన భార్య బాణసవాడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రదీప్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. 
చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement